తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి..నారాలోకేశ్‌పై అనంతపురం జిల్లా రాయదుర్గంలో కేసు నమోదైంది. వైకాపా అవినీతి, అరాచకాలను ప్రశ్నిస్తున్న తమ పార్టీ కార్యకర్తపై...రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి గుండాలతో దాడి చేయించారని ఏప్రిల్ 16న..లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఇందుకు వ్యతిరేకంగా సిద్ధాపురం తండాకు చెందిన భోజరాజు నాయక్..డి. హిరేహాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్న లోకేష్‌పై..చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతపురంలో నారా లోకేశ్‌పై క్రిమినల్ కేసు.. ఎందుకంటే?
16:59 May 08
లోకేశ్‌పై కేసు నమోదు చేయటంపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపు రామచంద్రారెడ్డి అనుచరులు చేస్తున్న అవినీతి, దౌర్జన్యాలకు...అడ్డుగా నిలబడతామని స్పష్టం చేశారు. వైకాపా రెండేళ్ల పాలనలో ప్రజలకందించిన సంక్షేమం కన్నా...ప్రతిపక్షాలపై పెట్టిన కేసులే అధికమని...తెలుగుదేశం ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు విమర్శించారు. రామచంద్రారెడ్డిని వదిలిపెట్టి...,ప్రశ్నిస్తున్న లోకేష్‌పై కేసు నమోదు చేయటం దారుణమని మండిపడ్డారు.
ఇదీ చదవండి:
కడప జిల్లా మామిళ్లపల్లె శివారులో పేలుడు.. 10కి చేరిన మృతుల సంఖ్య!