ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైనర్లపై దాడి ఘటనలో గ్రామపెద్ద అరెస్ట్ - ananthapuram district

అనంతపురం జిల్లాలో ఇద్దరు మైనర్లను గ్రామపెద్ద చితకబాదిన ఘటనపై కేసు నమోదైంది. బాలుడిపైనా కేసు నమోదు చేశారు పోలీసులు.

గ్రామపెద్ద అరెస్ట్

By

Published : Aug 17, 2019, 3:52 PM IST

గ్రామపెద్ద అరెస్ట్

అనంతపురం జిల్లా కేపీ దొడ్డిలో మైనర్లను చితకబాదిన గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్పను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. అతడ్ని రిమాండ్​కు తరలించనున్నట్లు వెల్లడించారు. బాలికతో శారీరకంగా కలిశాడన్న ఆరోపణలతో బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేపీ దొడ్డిలో డీఎస్పీ వెంకటరమణ, తహసీల్దార్‌ వెంకటచలపతి, ఐసీడీఎస్‌ అధికారులు విచారణ చేపట్టారు. కుటుంబసభ్యులతో మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. బాలికను కొట్టే సమయంలో రచ్చబండపై ఉన్నవారిని కూడా విచారించి వారిపైనా కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.

మరోవైపు బాధితురాలికి న్యాయం జరగాలంటూ ఇవాళ వివిధ దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దళితులపై ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details