ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ కార్డు దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి : జేసీ - dharmavaram municipality latest News

అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సచివాలయాలను జేసీ నిశాంత్ కుమార్ తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు.

రేషన్ కార్డు దరఖాస్తులకు వెంటనే కార్డులు అందజేయాలి : జేసీ
రేషన్ కార్డు దరఖాస్తులకు వెంటనే కార్డులు అందజేయాలి : జేసీ

By

Published : Oct 3, 2020, 4:29 PM IST

గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రజలకు సత్వర సేవలు అందే విధంగా ఉద్యోగులు పని చేయాలని జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శనివారం అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు.

రికార్డుల పరిశీలిన..

అనంతరం శివనగర్ సచివాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు వెంటనే కార్డు అందజేయాలన్నారు. వార్డు వాలంటీర్లతోనూ జేసీ మాట్లాడారు. బత్తలపల్లి మండలంలోని గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. జేసీ వెంట ధర్మవరం ఆర్టీవో మధుసూదన్ ఉన్నారు

ఇవీ చూడండి : వసతుల లేమే శాపం.. మిగిల్చింది గర్భశోకం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details