Car struck: అనంతపురం జిల్లాలో వర్షం కారణంగా.. ఉరవకొండ, విడపనకల్లు పరిధిలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆర్.కొట్టాల వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వంకలో.. ఐదుగురు ప్రయాణిస్తున్న కారు చిక్కుకుంది... గ్రామస్థులు ట్రాక్టర్ సాయంతో సురక్షితంగా బయటకు తీశారు. బళ్లారికి చెందిన కుటుంబం కసాపురం ఆంజనేయస్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా.. ఘటన జరిగింది. డోనేకల్లు వద్ద 67 జాతీయ రహదారిపై వంక ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల.. బళ్ళారి-గుంతకల్లు మధ్య కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి.
Car struck: అనంతలో భారీ వర్షం.. నీటిలో చిక్కుకున్న కారు - అనంతపురంలో భారీ వర్షం
Car struck: అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఉరవకొండ, విడపనకల్లు పరిధిలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆర్.కొట్టాల వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వంకలో కారు చిక్కుకుంది. ట్రాక్టర్ సాయంతో గ్రామస్థులు సురక్షితంగా వాహనాన్ని బయటకు తీశారు.
నీటిలో చిక్కుకున్న కారు