అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లి వద్ద కేఎస్ఆర్టీసీ బస్సు, ఒక కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులకు, కారులో వెళ్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.
'కేఎస్ ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. తొమ్మిది మందికి గాయాలు' - అనంతపురం జిల్లా నాగరెడ్డి పల్లి వద్ద కేఎస్ఆర్టీసీ బస్సును కారు ఢీ
అనంతపురం జిల్లా నాగారెడ్డిపల్లి వద్ద కేఎస్ఆర్టీసీ బస్సును కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల విచారణ చేస్తున్నారు.
కేఎస్ఆర్టీసీ బస్సును కారు ఢీ.. తొమ్మిది మంది గాయాలు
తిరుపతి నుంచి కర్ణాటకలోని గదగ్ వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు.. అనంతపురం నుంచి కదిరి వెళ్తున్న కారు వేగంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు ఒక పక్కకు ఒరిగింది. బస్సును ఢీకొన్న కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. క్షతగాత్రులను చికిత్స కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: రాజమహేంద్రవరానికి చెందిన మహిళకు యూకే స్ట్రెయిన్ నిర్ధరణ