అనంతపురం జిల్లా కదిరి పట్టణం ఎన్జీవో కాలనీలో ఇంటి పక్కన ఆపి ఉన్న కారు పూర్తిగా దగ్ధమైంది. స్థానికంగా ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవీంద్రనాథ్ కారును ఇంటి పక్కన ఆపి ఉంచారు. వేకువజామున కారు నుంచి పొగలు రావడంతో గుర్తించిన స్థానికులు రవీంద్రనాథ్‌కు సమాచారం అందించారు. స్థానికుల సహకారంతో మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
కారులో చెలరేగిన మంటలు... అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది - kadiri car fire news
ఇంటి పక్కన ఆపి ఉంచిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి... పూర్తిగా దగ్ధమయ్యింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది.
కారు దగ్ధం