అనంతపురం జిల్లా కదిరి పట్టణం సమీపంలోని జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి కడప జిల్లా సింహాద్రిపురానికి వస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని గాల్లో పల్టీలు కొట్టింది. కొన్ని మీటర్ల దూరం వరకు ఆగకుండా వెళ్లినట్లు అక్కడ ఉన్న స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాహన చోదకుడితో పాటు ఇద్దరు మహిళలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
డివైడర్ను ఢీకొని గాల్లోకి పల్టీలు కొట్టిన వాహనం - ananthapur district latest road accident news
బేరిపల్లి సమీపంలోని 42వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొట్టి కొంత దూరం వరకు ఆగకుండా వెళ్లింది.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి స్వల్పగాయాలు