ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్వర్టును ఢీ కొన్న కారు...ఒకరు మృతి - ananthapuram crime news

కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులదట్ల జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

car accident at avuladhatla highway ananthapuram district
కల్వర్టును ఢీకొన్న కారు

By

Published : Jun 21, 2020, 12:34 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల గ్రామ సమీపంలో జాతీయ రహదారి పై కారు ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో పట్టణానికి చెందిన ఒక వృద్ధురాలు మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలో ఓ ఫంక్షన్​కు వెళ్లి వస్తుండగా తిరుగు ప్రయాణంలో కారు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే కారుకు ఉన్న తలుపులు తెరచుకోవడంతో కుర్షుద్భి (65) అనే వృద్ధురాలు కింద పడి అక్కడికక్కడే మరణించింది. ఆమె కుమారుడు రఫిక్, కోడలు మీనా ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే పొలాల్లో ఉన్న రైతులు, స్థానికులు వారిని కారులో నుంచి బయటకు తీసి కాపాడారు. పోలీసులు క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గం సీఐ తులసీరామ్, ఎస్ఐ రాఘవేంద్ర ఘటనా స్థలాన్ని సందర్శించి... బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి: పట్టపగలే ...ఆర్టీసీ డిపోలో బస్సును కొట్టేశాడు.

ABOUT THE AUTHOR

...view details