ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంటెయిన్​మెంట్ జోన్​లో నిబంధనలు ఏవి..? - cantonment zone in madakasira news

కంటెయిన్​మెంట్ జోన్ పరిధిలో ప్రజలు ఇష్టానుసారం తిరిగేస్తున్నారు. నిబంధనలు మరిచి ప్రైవేటు, ప్రభుత్వ కార్యకలాపాలు సాగిస్తున్నారు. పోలీసులు ఒక చోటుకే పరిమితమైయ్యారు.

cantonment zone
cantonment zone

By

Published : Jul 9, 2020, 3:44 PM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణం సాయినగర్లో 15 రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఓవ్యక్తి మృతి చెందాడు. అధికారులు ఆ ప్రాంతాన్ని కంటెయిన్​మెంట్ జోన్​గా ప్రకటించారు. కంటెయిన్​మెంట్ జోన్ పరిధిలో రాష్ట్ర రహదారి ఉన్నందున పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ నుంచి సిద్ధార్థ స్కూల్ వరకు రోడ్డుకు ఒక భాగంలో రాకపోకలు సాగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డు మరో భాగంలో బస్సులు, గూడ్స్ వాహనాల రాకపోకలకు అనుమతించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలను నిలిపివేయాలి. ఇక్కడ బ్యారికేడ్ లోపల ఉన్న ప్రభుత్వ విద్యుత్ శాఖ కార్యాలయం పని చేస్తోంది.

మరోపక్క ఈ జోన్ పరిధిలో రాకపోకలకు ఏర్పాటు చేసిన రహదారి పక్కన ఉన్న ప్రైవేటు సంస్థలు, బ్యాంకులు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకుల వద్ద ప్రజలు భౌతికదూరం పాటించడంలేదు. కంటెయిన్​మెంట్ జోన్​కు నలువైపులా ఉండాల్సిన పోలీసులు కేవలం ఒకే చోట ఉండడంతో మిగిలిన చోట రాకపోకలు సాగుతూనే ఉన్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details