అనంతపురం జిల్లా గుంతకల్లులో కరోనాపై అవగాహన కల్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు విధిగా కరోనా నిబంధలను పాటించాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు. పట్టణంలోని మునిసిపాలిటీ కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు ర్యాలీ సాగింది. నో మాస్క్ -నో ఎంట్రీ అంటూ నినాదాలు చేశారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొవిడ్ అవగాహనకు ర్యాలీ నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. దీనివల్ల తమను తాము వైరస్ నుంచి కాపాడుకోవటమే కాక..ఇతరులను కూడా రక్షించిన వారు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు గ్రామ, వార్డు సచివాలయం, పోలీస్ సిబ్బంది, మెప్మా అధికారులు, మహిళలు పాల్గొన్నారు.