పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండటంతో రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గుంతకల్లు, గుత్తి ప్రాంతాల్లో గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు పాత కొత్త చెరువు, వై.టి చెరువులు నిండి ప్రధాన జాతీయ రహదారిపై నీరు చేరి ప్రవహిస్తున్నాయి.
రజాపురంలో పొంగిన వాగు-కొట్టుకుపోయిన లారీ
అనంతపురం జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలకు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రజాపురం గ్రామం వద్ద గల 63 నెంబరు జాతీయ రహదారిపై గల మరువ ఉద్ధృతంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగును దాటించబోయి గుత్తి నుంచి బళ్లారికి వెళ్తున్న లారీ కొట్టుకుపోయి బోల్తా పడింది.
రజాపురంలో పొంగిన వాగు-కొట్టుకుపోయిన లారీ
రజాపురం గ్రామం వద్ద చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. గ్రామ సమీపంలోని 63 నెంబరు జాతీయ రహదారిపై మరువ ఉద్ధృతంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీన్ని దాటించబోయి గుత్తి నుంచి బళ్లారికి వెళ్తున్న లారీ కొట్టుకుపోయి బోల్తా పడింది. స్థానికులు గమనించి తాళ్ల సాయంతో డ్రైవర్‌ను ఒడ్డుకు చేర్చారు.. వాగు ఉద్ధృతికి గుత్తి-బళ్లారి మధ్య వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇవీ చదవండి: గుత్తి, గుంతకల్లులో భారీ వర్షాలు..