అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని తహసీల్దారు కార్యాలయంలో డిష్ కేబుల్ నిర్వాహకులు ధర్నా చేపట్టారు. 20 ఏళ్లుగా డిష్ కేబుల్ ద్వారా జీవనోపాధి పొందుతున్న 30 కుటుంబాలు ఓ వైకాపా నాయకుడి దౌర్జ్యన్యానికి వీధిన పడ్డాయని ఆవేదన చెందారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి ...డిష్ ఆపరేటర్లకు చెందిన వైర్లను బలవంతంగా తొలగించి ఏపీ ఫైబర్ గ్రిడ్ కనెక్షన్స్ అమరుస్తున్నాడని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నాయకుడు రమేష్ రెడ్డి మాత్రం తాడిపత్రి పట్టణం, మండల పరిధిలోని 30 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన డిష్ కేబులు నిర్వాహకుల అభివృద్ధికి అడ్డు తగులుతున్నాడని డిష్ కేబుల్ నిర్వాహకులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు.
తాడిపత్రిలో కేబుల్ ఆపరేటర్ల ధర్నా - cable operators protest latest news
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని తహసీల్దార్ కార్యాలయంలో డిష్ కేబుల్ నిర్వాహకులు ధర్నా నిర్వహించారు. . వైకాపా రాష్ట్ర కార్యదర్శి...డిష్ ఆపరేటర్లకు చెందిన వైర్లను బలవంతంగా తొలగించి ఫైబర్ గ్రిడ్ కనెక్షన్స్ అమరుస్తున్నాడని ఆరోపించారు.

తాడిపత్రిలో కేబుల్ ఆపరేటర్ల ధర్నా