స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రి శంకరనారాయణ వ్యాఖ్యలు
'స్థానిక సంస్థల ఎన్నికలకు మేం సిద్ధం' - స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడిన మంత్రి శంకర నారాయణ
స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సంక్షేమ నిధి నుంచి వచ్చిన చెక్కులను అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో హైకోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉన్నామని.. న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
!['స్థానిక సంస్థల ఎన్నికలకు మేం సిద్ధం' minister sankara narayana talks about local body elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6267124-763-6267124-1583146628300.jpg)
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి శంకర నారాయణ