ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైక్​, ఆటో ఢీ.. 8 మందికి గాయాలు - crime news at kalyanadurgam

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆటో అదుపు తప్పింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

byke auto accident at ananthapuram district
బైక్​, ఆటో 'ఢీ' ఎనిమిది మందికి గాయాలు

By

Published : Oct 14, 2020, 6:36 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆటో అదుపు తప్పింది. డి.హిరేహాల్ మండలంకు చెందిన భాగ్యమ్మ తన భర్తతో పాటు పుట్టింటికి బైక్​పై వెళ్తుండగా... కళ్యాణదుర్గం వైపునుంచి విద్యుత్ పరికరాలతో వెళ్తున్న ఆటో.. వారిని ఢీ కొట్టింది.

ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. బైక్​పై ఉన్న భార్యభర్తలు భర్త హనుమంతు తలకు తీవ్ర గాయాలయ్యయి. పరిస్థితి విషమంగా ఉందని అనంతపురంకు తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details