రన్నింగ్‌లో ఉండగానే ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్.. - bus accident in ananthapuram district
09:42 September 09
bus accident in ananthapuram district
రన్నింగ్‌లో ఉండగానే ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. గురువారం ఉదయం జిల్లాలోని విడపనకల్ మండలం పాల్తూరు నుండి చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులను, ప్రయాణికులను ఎక్కించుకొని హవళిగి వెళ్తున్న ఎపీఎస్ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగానే ఒక్కసారిగా వెనుక చక్రాలు ఊడిపోయాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డుపక్కన ఉన్న ద్విచక్రవాహనాన్ని బస్సు లాక్కొని వెళ్ళింది. ప్రయాణికులు, విద్యార్థులను మరొక బస్సులో తమ గమ్యస్థానాలకు చేర్చారు. ఫిట్నెస్ లేని బస్సులను ఉపయోగించడం.. కాలం చెల్లిన బస్సులను వాడటం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: lokesh narsaraopeta tour: లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు