అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. లారీలో ఒకరు, బస్సులో ఒకరు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. మిడుతూరు వద్ద లారీని బస్సు ఢీకొట్టింది.
Accident: లారీని ఢీ కొట్టిన బస్సు.. ఇద్దరు మృతి - అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టిన ఘటనలో.. ఇద్దరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి.
accident
Last Updated : Apr 1, 2022, 6:22 AM IST