శ్మశానవాటికికు వెళ్లే దారిని కొందరు మూసివేయటంతో మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన అనంతపురం జిల్లా బీకేఎస్ మండలం జంతులూరులో చోటు చేసుకుంది. గ్రామంలో ఓ కాలనీ మీదుగా శ్మశానానికి దారి ఉండేది. ఈ మధ్య కొందరు ఆ దారిని మూసివేశారు. ఈ విషయంలో కాలనీలోని ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది.
ఇవాళ ఓ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. శ్మశానానికి వెళ్లే దారి మూసివేయడం వల్ల బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయం తెసుకున్న తహసీల్దార్ అక్కడికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. సమస్యను పరిష్కారిస్తానని ఆయన చెప్పారు.