ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లాలో బీటెక్​ విద్యార్థిని ఆత్మహత్య - నల్లచెరువు వార్తలు

అనంతపురం జిల్లాలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పండుగకు ఇంటికి వచ్చిన తమ కూతురు శాశ్వతంగా దూరమైందటూ ఆమె తల్లిదండ్రలు కన్నీటి పర్యాంతవయ్యారు. మృతురాలు రాసిన సూసైడ్​ నోటును పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం జిల్లాలో బీటెక్​ విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం జిల్లాలో బీటెక్​ విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Jan 12, 2021, 1:00 PM IST

Updated : Jan 12, 2021, 1:05 PM IST

అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం కొత్త పూలోళ్లపల్లిలో బీటెక్ విద్యార్థిని అశ్విని ఆత్మహత్యకు పాల్పడింది. అశ్విని పుట్టపర్తిలోని ఓ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

కుటుంబ సభ్యులు పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లడంతో ఇంట్లోనే ఉన్న అశ్విని ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడింది. గుర్తించిన సోదరి కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకుని.. ఆమెను కిందకు దించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందింది .పండగకు ఇంటికి వచ్చిన బిడ్డ శాశ్వతంగా దూరమైందంటూ తల్లిదండ్రులు రామచంద్ర, గంగాదేవి బోరున విలపించారు.

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తాను మనస్తాపంతో చనిపోతున్నానని, తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని రాసుకున్న సూసైడ్ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి

చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు మృతి

Last Updated : Jan 12, 2021, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details