ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంత జేఎన్‌టీయూలో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..! - News of student suicide in Anantapur

JNTU Student Suicide: విద్యార్థి తల్లిదండ్రులు తమ కుమారుడు మంచిగా చదువుకుని కష్టాలు తీరుస్తాడని ఆశ పడ్డారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. అనంతపురం జేఎన్‌టీయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రుల కలలను కాలారాశాడు చాణక్య.

విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఆత్మహత్య

By

Published : Jan 5, 2023, 4:19 PM IST

JNTU Student Suicide: అనంతపురం జేఎన్‌టీయూ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన చాణక్య జేఎన్‌టీయూలోని ఎల్లోరా వసతి గృహంలో ఉంటున్నాడు. వ్యక్తిగత కారణాల వలనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన చరవాణీలో పేర్కొన్నాడని పోలీసులు వివరించారు. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details