అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలో ఉన్న బీటీ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వెల్లడించారు. తెదేపా హయాంలో మంత్రిగా ఉన్న కాల్వ శ్రీనివాసులు చెరువులు నింపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విప్ ఆరోపించారు. బీటీ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయదుర్గం నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీరు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
బీటీ ప్రాజెక్టు పనులు కొనసాగింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు - latest news of bt project
అనంతపురం జిల్లా గుమ్మగట్ట బీటీ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు విప్ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

బీటీ ప్రాజెక్టు పనులు కొనసాగింపుకు ప్రభుత్వం ఉత్తర్వులు