ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యక్తి దారుణ హత్య... ఆర్థిక లావాదేవీలే కారణం? - అనంతపురం

అనంతపురం జిల్లా ధర్మవరంలో రామకృష్ణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు.

వ్యక్తి దారుణ హత్య

By

Published : Apr 24, 2019, 9:13 PM IST

వ్యక్తి దారుణ హత్య

అనంతపురం జిల్లా ధర్మవరం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణంలో రామకృష్ణ అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేసి చంపారు. ధర్మవరం పట్టణంలోని శాంతినగర్​లో నివాసముంటున్న రామకృష్ణను... పని ఉందంటూ కొందరు వ్యక్తులు ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి హతమార్చారని... మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక లావాదేవీలే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details