ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమ పెళ్లి చేసుకుంది..రాఖీ కట్టడానికి ఏడేళ్ల తర్వాత వస్తే కొట్టారు - చెల్లిపై దాడి చేసిన అన్నలు వార్తలు

ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది... ఏడేళ్ల తరువాత అన్నయ్యలకు రాఖీ కట్టడానికి వచ్చింది. తమను కాదని.. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో.. చెల్లి అని కూడా చూడకుండా చితకబాదారు అన్నయ్యలు.

brothers assault on sister
చెల్లిపై దాడి చేసిన అన్నలు

By

Published : Aug 3, 2020, 9:23 PM IST

ఏడేళ్లు గడిచినా.. ఆ అన్నలకు తమ చెల్లిపై కోపం చల్లారలేదు... తమను కాదని ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని కోపం పెంచుకున్నారు. ఇదేమీ తెలియని ఆ చెల్లి.. అన్నలపై ప్రేమతో రాఖీ కట్టేందుకు వచ్చింది. అంతే చెల్లి అని చూడకుండా చితకబాదారు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది.

వీవర్స్ కాలనీకి చెందిన భారతి.. ఏడేళ్ల క్రితం అన్నలను కాదనుకొని.. ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. తిరిగి ఇప్పుడు రాఖీ కట్టేందుకు వచ్చింది. ఏడేళ్లు గడిచినా.. చెల్లిపై కోపం తగ్గకపోగా.. ఆమె రాఖీ కట్టడానికి వచ్చిందని దాడి చేశారు. దాడిలో స్వల్పంగా గాయపడిని భారతి.. భర్త సహాయంతో అక్కడ నుంచి బయటపడి.. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హిందూపురం గ్రామీణ మండలం పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఈ-రక్షాబంధన్​తో మహిళలకు రక్ష: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details