ఉరవకొండ పట్టణం పాతపేటలో గురువారం సాయంత్రం జరిగిన అన్నదమ్ముల ఘర్షణలో రామాంజనేయులు(39) అనే వ్యక్తి మృతి చెందాడు. మద్యం మత్తులో తరచూ తాగి వచ్చి తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ… తీవ్ర దుర్భాషలాడాడని తమ్మడు మల్లేష్ పేర్కొన్నాడు. ఆ మానసిక హింస భరించలేక పక్కనున్న ఇనుపరాడ్డుతో తల పగలకొట్టాడు. దీంతో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి భార్య 14 ఏళ్ల క్రితమే అతన్ని వదిలేసి వెళ్లిందని బంధువులు తెలిపారు. అన్ననే కదా అని 14 సంవత్సరాలుగా ఆ బాధను భరిస్తూ ఉన్నానని... తన భార్యను చెప్పలేని భాషలో నిత్యం తిడుతూ ఉంటే భరించలేక ఈ పని చేసినట్లు తమ్ముడు మల్లేష్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మల్లేష్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఉరవకొండ ఎస్సై ధరణిబాబు తెలిపారు. ఓ కుమారుడు జైలుకు వెళ్లి, మరొకరు మృతి చెందడం వల్ల రామాంజనేయులు తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.
అన్నను కడతేర్చిన తమ్ముడు… మానసిక హింస భరించలేకే..
మద్యం తాగి వచ్చి తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ… తీవ్ర దుర్బాషలాడుతున్నాడని సొంత అన్నను తమ్ముడు కడతేర్చాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటు చేసుకుంది.
ఉరవకొండ పట్టణం పాతపేటలో ఓ హత్య