అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరు గ్రామంలో దారుణం జరిగింది. భూమి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం తమ్ముడి దారుణ హత్యకు దారి తీసింది. శనగల గూడూరు గ్రామానికి చెందిన రామంజి, రాజకుల్లాయిలు అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా భూమి విషయంలో తగాదా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం తోట దగ్గర ఉన్న తమ్ముడు రాజకుల్లాయి వద్దకు అన్న రామంజి, అతని కొడుకు మధు వచ్చారు. తండ్రీ కొడుకులు కలిసి రాజకుల్లాయి కళ్ళలో కారం చల్లి కొడవలితో కిరాతకంగా తల నరికారు. అనంతరం మొండెం నుంచి తలను దూరంగా తీసుకెళ్లి వేశారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి డీయస్పీ ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.
దారుణం... తమ్ముడి తల నరికిన అన్న - thamudi thala narikina anna
అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం చివరికి తమ్ముడి దారుణ హత్యకు దారితీసింది. సొంత తమ్ముడు అని చూడకుండా నిర్థాక్షిణంగా తల నరికాడు అన్న. ఈ అమానుషమైన ఘటన అనంతపురం జిల్లా శనగల గూడురు గ్రామంలో జరిగింది.

తమ్ముడి తలనరికిన అన్న