Boy Murder For Property:అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన అఖిల్ మే 21న తిమ్మప్పస్వామి జాతరకు వెళ్లి అదృశ్యమయ్యాడు. రోజు గడిచినా తిరిగిరాలేదు. మే 22న అఖిల్ తల్లి శారదమ్మ.. తన కుమారుడు కనిపించటంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భిన్న కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు దాదాపు 70 రోజుల తర్వాత అఖిల్ ఇక లేడని తేల్చారు.
శారదమ్మకు అఖిల్‌తోపాటు.. వర్షిత, త్రిష అనే ముగ్గురు సంతానం. వర్షితను 8 నెలలక్రితం గుద్దేళ్ల గ్రామానికి చెందిన అనిల్‌కు ఇచ్చి పెళ్లిచేశారు. కొన్నిరోజుల తర్వాత అనిల్ కన్ను.. అత్త ఆస్తిపై పడింది. ఆమెకు ఉన్న 13 ఎకరాలు తన సొంతమవ్వాలంటే బావమరిది అఖిల్‌ను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. సెల్‌ఫోన్ ఇప్పిస్తానంటూ అఖిల్‌ను బైక్ ఎక్కించుకున్నాడు. తన పొలం పక్కనే ఉన్న వంకలోకి తీసుకెళ్లాడు. అఖిల్ కాళ్లు, చేతులు వైర్‌తో కట్టేసి మెడపై కొడవలితో వేటు వేశాడు. అనంతరం అక్కడే గుంతలో పూడ్చేశాడు.