ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

10 ఏళ్ల క్రితం అన్న ఇచ్చిన మేక.. చెల్లెలి కుటుంబాన్ని పోషిస్తోంది - అనంతపురంలో మేకపై కుటుంబం ఆధారం న్యూస్

చెల్లెలికి.. అన్న ఇచ్చిన.. మేకే ఆ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆడపిల్లకు కానుకగా ఇచ్చిన.. మేకే ఇప్పుడు ఆధారమైంది. పదేళ్ల క్రితం అన్న.. ప్రేమగా ఇచ్చిందే.. ఇప్పుడు సంపదగా మారింది.

10 ఏళ్ల క్రితం అన్న ఇచ్చిన మేక.. చెల్లెలి కుటుంబాన్ని పోషిస్తుంది
10 ఏళ్ల క్రితం అన్న ఇచ్చిన మేక.. చెల్లెలి కుటుంబాన్ని పోషిస్తుంది

By

Published : Aug 28, 2020, 8:42 AM IST

శ్రావణ మాసంలో ఇంటి ఆడపిల్లలకు సారె రూపంలో కానుక రూపంలో ఏదైనా.. ఇస్తుంటారు. ఓ అన్న తన చెల్లికి ఇచ్చిన దానం ఆమె ఇంటికి సంపదగా మారింది. అనంతపురం జిల్లా మడకశిర మండలం కదిరేపల్లి గ్రామంలో రంగధామప్ప అనే వ్యక్తి.. తన చెల్లి నాగమ్మకు పదేళ్ల క్రితం గౌరీ పండుగ రోజు పసుపు కుంకుమతో పాటు ఓ మేకను ఇచ్చాడు. ఆ మేక ఈతకు మూడు నాలుగు పిల్లలను జన్మనిస్తూ వచ్చింది. నాగమ్మ కుటుంబం అప్పటి నుంచి ఆ మేకపైనే ఆధారపడింది. కుటుంబ పోషణ కోసం దాని పిల్లలను అమ్ముతూ వస్తున్నారు. దాని సంతతి ఇప్పటికీ 50 మేకలు ఉన్నాయి.

'10 ఏళ్ల క్రితం..మా అన్న పసుపు కుంకుమ తో పాటు మేకను ఇచ్చాడు. ఆ మేక సంతతితో ఇప్పటివరకూ జీవనం సాగిస్తున్నాం. ప్రస్తుతం 50 మేకలు ఉన్నాయి'. అని చెల్లి చెబుతోంది. నా కున్న ఇద్దరు చెల్లెళ్లకు పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి ఒక మేకపిల్లను ఇచ్చాను. నాగమ్మ ఆ మేక పిల్ల సంతతిని ఇంత అభివృద్ధి చేసి..నేనిచ్చిన మేకను అమ్మకుండా అలాగే ఉంచినందుకు చాలా సంతోషంగా ఉంది.' అని అన్న చెబుతున్నాడు.

10 ఏళ్ల క్రితం అన్న ఇచ్చిన మేక.. చెల్లెలి కుటుంబాన్ని పోషిస్తుంది

ఇదీ చదవండి:రాజధాని రైతుల పిటిషన్​పై విచారణ: సీఎం సహా.. రాజకీయ నేతలకు హైకోర్టు నోటీసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details