ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహం రద్దు.. మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య - బలవన్మరణానికి పాల్పడ్డ యువకుడు

అనంతపురం జిల్లా హిందూపూర్​కు చెందిన హరి అనే యువకుడు పెళ్లి రద్దైందని ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు వధువు వద్దకు వెళుతుండగా.. విషయం తెలియడంతో మార్గ మధ్యలో కర్ణాటకలోని దొడ్డబల్లాపూర్​ స్టేషన్​ వద్ద దిగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

young man suicided for cancelation of marriage
వివాహం రద్దైందని మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

By

Published : Jan 31, 2021, 7:59 PM IST

వధువు తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేయడంతో వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా హిందూపూర్​కు చెందిన హరి (28) అనే యువకుడికి బెంగళూరుకు చెందిన ఒక యువతితో పెళ్లి నిశ్చయమైంది. వధువును కలిసేందుకు అతడు హైదరాబాద్​ నుంచి బెంగళూరుకు రైలులో ప్రయాణమయ్యాడు.

కానీ సదరు వధువు తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారని.. వివాహం రద్దయిందని తెలుసుకుని మార్గ మధ్యలో కర్ణాటకలోని దొడ్డబల్లాపూర్​ స్టేషన్​ వద్ద రైలు నుంచి దిగిపోయాడు. మనస్థాపానికి గురైన హరి అక్కడే పట్టాలపై వస్తున్న ఒక రైలుకు ఎదురుగా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దొడ్డబల్లాపూర్ రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details