ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bride Escape: కొద్ది గంటల్లో వివాహం...కానీ అంతలోనే.. - కొద్ది గంటల్లో వివాహం..పెళ్లి పందిరి నుంచి వధువు పరారీ

కొద్ది గంటల్లో పెళ్లి... అందరూ పెళ్లి పనుల్లో తలమునకలై ఉన్నారు... ఏమైందో తెలీదు కానీ..సీనీ ఫక్కీలో పెళ్లి కూతురు రాత్రికి రాత్రే పరారైంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకోగా..తమకు అవమానం జరిగిందని పెళ్లి కొడుకు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొద్ది గంటల్లో వివాహం
కొద్ది గంటల్లో వివాహం

By

Published : Aug 26, 2021, 9:15 AM IST

కొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. సినీ ఫక్కీలో పెళ్లి పందిరి నుంచి పెళ్లికూతురు పరారైన సంఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట మండలం బలిజపల్లెకు చెందిన యువకుడు(26), తంబళ్ళపల్లె మండలం కొటాల పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి పెద్దలు వివాహం నిశ్చయించారు. ఇరు కుటుంబాల వారు చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చి అమ్మచెరువు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో బుధవారం ఉదయం వివాహానికి ఏర్పాట్లు చేశారు.

కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి వధూవరులకు నలుగు పెట్టారు. పెళ్లికుమార్తె రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా పరారైంది. తమకు అవమానం జరిగిందని పెళ్లి కొడుకు, బంధువులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో పెళ్లికూతురు మైనర్‌ అని తేలింది. ఒకటో పట్టణ ఎస్సై లోకేష్‌ దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details