ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండలో వైభవంగా చంద్రమౌళీశ్వరుడి బ్రహ్మోత్సవాలు - అనంతపురం జిల్లా వార్తలు

ఉరవకొండలో చంద్రమౌళీశ్వరుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామి వారిని నెమలి వాహనంపై ఊరేగించారు. గవిమఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్ర స్వామి ఈ వేడుకలో పాల్గొన్నారు.

brahmostavam
ఉరవకొండలో వైభవంగా చంద్రమౌళీశ్వరుడి బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 21, 2021, 6:43 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం సాయంత్రం నెమలి వాహనోత్సవం ఘనంగా జరిగింది. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని నెమలి వాహనంపై ఉంచి ఊరేగించారు. అంతకుముందు చంద్రమౌళీశ్వరస్వామి వారి మూల విరాట్​కు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవిమఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్ర స్వామి, ఉత్తరాదికారి శ్రీకరిబసవ రాజేంద్రస్వామి, ఆదోని చౌకి మఠం పీఠాధిపతి శ్రీకల్యాణి స్వామి సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఏడాదిలోగా బీటీపీ కాలువ పనులు పూర్తి: ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్

ABOUT THE AUTHOR

...view details