ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడు ఆత్మహత్య.. సూసైడ్ నోట్​లో ఏం చెప్పాడంటే..! - boy hang himeself in anantapur dt

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వివాదస్పదంగా మారింది. పట్టణంలోని సాయి టవర్స్ హోటల్లో పని చేసే మహేష్ అనే యువకుడు తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

boy suicidne in anantapur dst  puttaparhi due t work stress
boy suicidne in anantapur dst puttaparhi due t work stress

By

Published : May 20, 2020, 8:16 AM IST

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు సాయిటవర్స్ హోటల్ యజమాని పద్మనాభం, మేనేజర్ శైలజ వేధింపులే కారణం అంటూ లేఖ రాసి చనిపోయాడు. కొన్నేళ్లుగా మహేష్ ఆ హోటల్లో పని చేస్తున్నాడు. తనలానే చాలామంది సిబ్బంది వేధింపులకు గురవుతున్నట్టు లేఖలో చెప్పాడు.

ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహేష్ బంధువులు.. సాయి టవర్స్ వద్ద మృతదేహంతో ఆందోళన దిగారు. మహేష్ ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details