అన్నదమ్ముల మధ్య గొడవ... తమ్ముడు ఆత్మహత్య - latest suicide news in ananthapuram district
అనంతపురం జిల్లా పెనుకొండలో విషాదం జరిగింది. సెల్ఫోన్ విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదంలో... తల్లి మందలించిందని మనస్థాపంతో బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నదమ్ముల మధ్య గొడవ... తమ్ముడు ఆత్మహత్య
సెల్ఫోన్ విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ తమ్ముడి ప్రాణాన్ని బలిగొంది. అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన రవీంద్రకు ఇద్దరు కుమారులు. లాక్డౌన్ కారణంగా స్కూళ్లకు సెలవు ఇవ్వటంతో పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. ఈ నేపథ్యంలో తరచూ అన్నదమ్ములు చిన్నపాటి ఘర్షణకు దిగేవారని... అయితే తల్లి మందలించటంతో చిన్న కుమారుడు ఇంటి మేడపైన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.