ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం.. బావిలో శవమై - ananthapuram crime news

ఈ నెల 13న అనంతపురం జిల్లా రెడ్డిపల్లిలో కనిపించకుండా పోయిన బాలుడి కథ విషాదంగా మారింది. గ్రామ శివారులోని పాడుబడ్డ బావిలో బాలుడు శవమై కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

బాలుడి కిడ్నాప్ విషాదాంతం...బావిలో శవమై
బాలుడి కిడ్నాప్ విషాదాంతం...బావిలో శవమై

By

Published : Sep 18, 2021, 8:47 PM IST

అనంతపురం జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో అదృశ్యమైన 13ఏళ్ల బాలుడి కథ విషాదాంతమైంది. కమ్మవారిపల్లి గ్రామ శివార్లలో పాడుబడ్డ బావిలో విఘ్నేష్‌ మృతదేహాన్ని గుర్తించారు. బాలుడి మృతితో వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విఘ్నేష్‌ను హత్య చేసి ఉంటారనే పోలీసులు విచారిస్తున్నారు.

స్థానికంగా డ్రైవర్‌గా ఉన్న చౌడప్పపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలిస్తుండగా చౌడప్పే హత్య చేసి ఉంటాడన్న ఆవేశంతో ఊగిపోయిన గ్రామస్థులు.. తమకు అప్పగించాలని పోలీసులను అడ్డగించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి.. శాంతించాలని గ్రామస్థులకు సర్ది చెప్పబోయారు. ఆయన మాటలనూ లెక్కచేయని గ్రామస్థులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు.

ఇదీ చదవండి:

MURDER: రౌడీషీటర్‌ దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా..?

ABOUT THE AUTHOR

...view details