ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదానికి తల్లీకుమారులు బలి.. 2 రోజుల తేడాలో ఇద్దరు మృతి - అనంతపురంలో రోడ్డు ప్రమాదం తల్లీకొడుకు బలి

తల్లీకుమారులు ద్విచక్రవాహనంపై ఆనందంగా వెళుతున్నారు. ఐషర్ వాహనం యమపాశమై వారిని బలంగా ఢీకొట్టింది. తల్లి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. హృదయవిదారకర ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

boy died with road accident
నీ దగ్గరే ఉంటానమ్మా

By

Published : Oct 10, 2020, 5:28 PM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణం, 42వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు సాయిగణేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లీకుమారులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఐషర్ వాహనం ఢీకొంది.

తల్లి కవిత అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని వైద్యం కోసం అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. వారి కుటుంబ సభ్యుల్లో అంతులేని విషాదం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details