అనంతపురంలో నవీన్ నాయక్ అనే బాలుడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. నగరంలోని కమలానగర్ లోని ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ నాయక్ కుమారుడు 7 ఏళ్ల వయసు గల నవీన్ నాయక్ ఇనుప కడ్డీతో ఆడుకుంటున్నాడు.
అపార్టుమెంటులోని విద్యుత్తు వైర్లకు ప్రమాదవశాత్తు బాలుడు తాకిన పరిస్థితుల్లో... షాక్తో అక్కడిక్కడే మృతిచెందాడు. బాలుడి మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.