నీటికుంటలో పడి బాలుడు మృతి - Anantapur latest news
ప్రమాదవశాత్తు నీటిలో పడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం యు.రంగాపురం గ్రామంలో జరిగింది.
![నీటికుంటలో పడి బాలుడు మృతి Boy died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10:43-ap-atp-78-07-baludu-mruti-photo-ap10175-07062020215114-0706f-1591546874-3.jpg)
Boy died
ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం యు.రంగాపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కరీం అనే 14 సంవత్సరాల బాలుడు పశువులను గడ్డి మేపేందుకు బయటకు తీసుకెళ్లాడు. గడ్డి మేసిన పశువులకు నీరు తాగిపించేందుకు నీటి కుంట వద్దకు తీసుకువెళ్ళాడు. కరీం ప్రమాదవశాత్తు జారి కుంటలోని నీటిలో మునిగిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతన్ని బయటకు తీశారు. అప్పటికే కరీం మృతి చెంది ఉన్నాడు.