అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందగా .. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనఅనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం సామరాయపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన జీవన్ కుమార్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బెంగళూరు పెట్రోల్ బంక్లో పనిచేసే అతను కరోన కారణంగా ఎనిమిది నెలలుగా గుడిబండలో ఉంటున్నాడు. ఉన్నట్టుండి మరణించాడు. మృతునికి నాలుగేళ్ల కిందట గుడిబండకు చెందిన రేణుకతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పోలీసులు సంఘటనా స్థలం వద్ద దర్యాప్తు చేపట్టారు.
సామరాయపాలెంలో అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి - సామరాయపాలెంలో వ్యక్తి మృతి వార్తలు
అనంతపురం జిల్లా సామరాయపాలెం గ్రామంలో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![సామరాయపాలెంలో అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి boy dead in unconsious at samarayapalem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9522661-827-9522661-1605176854708.jpg)
సామరాయపాలెంలో అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతి