ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పార్టీ కోసం పనిచేసే వాళ్లకే టిక్కెట్లు ఇవ్వండి' - local bodies elections in AP news

పార్టీ కోసం పని చేసిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలని అనంతపురం జిల్లా ఇంఛార్జీ మంత్రి బొత్స నేతలకు సూచించారు. టిక్కెట్ల కేటాయింపుల్లో ఏకపక్షంగా వ్యవహరించవద్దని.. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.

bosta comments on local bodies elections in ananthapur
bosta comments on local bodies elections in ananthapur

By

Published : Jan 12, 2020, 7:11 PM IST

పార్టీ కోసం పని చేసే వాళ్లకే టిక్కెట్లివ్వాలన్న మంత్రి బొత్స
పార్టీ కోసం పని చేసిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలని అనంతపురం జిల్లా ఇంఛార్జీ మంత్రి బొత్స నేతలకు సూచించారు. అనంతపురం నగర శివారులో వైకాపా జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి శంకరనారాయణతో పాటు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై నేతలు విస్తృతంగా చర్చించారు. టిక్కెట్ల కేటాయింపుల్లో ఏకపక్షంగా వ్యవహరించవద్దని.. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి బొత్స సూచించారు. రేపటి నుంచే ఎన్నికలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబుపై బొత్స విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైకాపా లీగల్ సెల్ అధ్యక్షుడు నారాయణరెడ్డి సభా వేదిక పై తనకు అన్యాయం జరిగిందని ప్రశ్నించగా..సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు ఆయన్ను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. సమావేశం అనంతరం నగరంలో రూ.59 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి బొత్స శంకుస్థాపన చేశారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details