రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంట గ్రామంలో బోరుబావి నుంచి నీరు ఉబికివస్తోంది. హంద్రీనీవా ద్వారా జీడిపల్లి జలాశయం, చెరువులు నిండి మరువ పారుతున్నాయి. భూగర్భజలాల నీటిమట్టం పెరిగింది. దీంతో మోటార్ ఆన్ చేయకుండానే బోరుబావుల నుంచి నీరు పైకి వస్తోంది.
కరువు జిల్లాలో పైకొచ్చిన పాతాళగంగ - water levels of bore wells in ananthapur
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడటంతో నదులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భజలాలు పెరిగాయి. కరవు జిల్లా అయిన అనంతపురంలో బోరుబావుల నుంచి నీరు ఉబికివస్తోంది.
బోరుబావి నుంచి ఉబికివస్తున్న నీరు
గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే రైతు పొలంలోని బోరు బావి నుంచి వెలుపలకు వస్తున్న నీరు నాలుగు ఎకరాల వరి పంటకు సరిపోతుందన్నారు. దాదాపు రెండువందలకు పైగా బోరుబావుల్లో నీటి మట్టం పెరిగింది. ఇదివరకు 500-800 అడుగుల లోతు వరకు బోరు బావులు తవ్వించేవారు. ప్రస్తుతం పరిస్థితి మారటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: గోదావరి-బనకచర్లకు రెండు మార్గాలు..!