ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 500 అడుగులకు పడిపోయిన బోర్లలోనూ... నీరు ఉప్పొంగుతోందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామ శివారులో... కొన్ని బోర్లలో మోటార్ ఆన్ చేయకుండానే నీరు బయటకు వస్తోంది. ఐదేళ్ల క్రితం వదిలివేసిన బోర్లు నుంచి ఇలా నీరు బయటికి రావటంతో తమకు ఉపశమనం లభించిందని రైతులు చెప్పారు. నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు బోర్ల నుంచి నీరు పైకి ఉబికి వస్తోంది. ఈ పరిస్థితి పంటల సాగుకు అనువుగా మారిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మోటార్ ఆన్ చేయకుండానే... నీరు బయటకు..! - అనంతపురం భారీ వర్షాల తాజా న్యూస్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనంతపురం జిల్లా తిమ్మాపురం గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 500 అడుగులకు పడిపోయిన బోర్లలోనూ ప్రస్తుతం నీరు ఉప్పొంగుతోందని హర్షం వ్యక్తం చేశారు.
![మోటార్ ఆన్ చేయకుండానే... నీరు బయటకు..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4942210-29-4942210-1572713862846.jpg)
bore water over flow in ananthapuram district