ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓబుళాపురంలో అంతర్రాష్ట్ర సరిహద్దు గుర్తింపు - ఓబుళాపురంలో అంతర్​రాష్ట్ర సరిహద్దు వివాదం వార్తలు

అనంతపురం జిల్లా ఓబుళాపురంలో అంతర్రాష్ట్ర సరిహద్దును అధికారులు గుర్తిస్తున్నారు. డ్రోన్ కెమెరా సాయంతో సర్వే పనులు జరుగుతున్నాయి.

ఓబుళాపురంలో అంతర్‌రాష్ట్ర సరిహద్దు గుర్తింపు
ఓబుళాపురంలో అంతర్‌రాష్ట్ర సరిహద్దు గుర్తింపు

By

Published : Mar 1, 2021, 10:53 PM IST

అనంతపురం జిల్లా ఓబుళాపురంలో అధికారులు అంతర్రాష్ట్రసరిహద్దును గుర్తింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియలో సర్వే ఆఫ్ ఇండియా, 2 రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. సర్వే ప్రక్రియ రెండ్రోజులు జరుగుతుందని అధికారుల వెల్లడించారు.

అసలు వివాదం

దశాబ్దానికి పైగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఉంది. మైనింగ్ కంపెనీలు అక్రమంగా చొరబడి చెరిపేసిన అంతర్రాష్ట్ర సరిహద్దుల పునరుద్ధరణలో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. భూభాగం తమదంటే.. తమదనే ధోరణిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు పట్టుబట్టి, సుప్రీం కోర్టు వరకూ వెళ్లాయి. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గతంలో నిర్వహించిన సర్వేల ఆధారంగా గుర్తించిన హద్దులను మరోసారి పరిశీలించి రెండు రాష్ట్రాల భూభాగాన్ని గుర్తించనున్నారు.

ఇదీ చదవండి:రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు అడ్డగింత.. ఎప్పుడేం జరిగిందంటే?

ABOUT THE AUTHOR

...view details