ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

1976 నుంచి... పరిహారం కోసం పడిగాపులు - bonded labours in spandana meeting

వెట్టి చాకిరి చేసిన తమకు ఇప్పటి వరకూ పరిహారం చెల్లించలేదని... అనంతపురం జిల్లా మడకశిర స్పందన కార్యక్రమంలో 190 మంది సబ్​ కలెక్టర్​కు అర్జీ పెట్టుకున్నారు.

1976 నుంచి....పరిహారం కోసం పడిగాపులు

By

Published : Nov 19, 2019, 11:43 PM IST

1976 నుంచి... పరిహారం కోసం పడిగాపులు

వెట్టి చాకిరి చేస్తున్న వారికి వెంటనే విముక్తి కలిగించి... రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ పరిహారం చెల్లించాలని 1976లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెట్టి చాకిరీ కార్మికులుగా అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో సుమారు 196 మంది గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ 196 మందికి ఎటువంటి పరిహారం అందలేదు. కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఏళ్ల తరబడి తిరగుతున్నా... తమకు పరిహారం రాలేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. స్పందన కార్యక్రమంలో సబ్​ కలెక్టర్​కు అర్జీ పెట్టుకున్నారు. అర్జీ పత్రాలు పరిశీలించిన అధికారులు... త్వరలోనే ఈ 196 మంది సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details