ధర్మవరంలో వైభవంగా బోనాలు - bonalu
సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ అనంతపురం జిల్లా ధర్మవరంలోని దుర్గమ్మ అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు.
ధర్మవరంలో వైభవంగా బోనాల పండుగ
ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో దుర్గమ్మ అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. పట్టణంలోని రాజేంద్ర నగర్ కు చెందిన మహిళలు 108 బోనాలను తలపై ఎత్తుకొని ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు కురిసి పంటలు పండాలని అమ్మవారిని భక్తులు కోరుకున్నారు.