అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గొల్లపల్లి వద్ద బొలెరో వాహనం బోల్తా పడిన ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక లోని హోస్పేట్లో ఉన్న ఉలిగిలో దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో 30 మంది ప్రయాణిస్తున్నారు.
క్షతగాత్రులను చికిత్స కోసం రాయదుర్గంలోని ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గుమ్మగట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.