అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఉప్పొంక సమీపంలో ఎద్దుల బండిని వెనుక నుంచి బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండిని తోలుకెళ్తున్న రైతు అంజినప్ప తలకు, కాళ్లకు గాయాలు కాగా.. బహిర్భూమి కోసం వెళ్తున్న తిప్పమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.
ఎద్దుల బండిని ఢీకొట్టిన బొలెరో... మహిళకు తీవ్ర గాయాలు - ఉప్పొంక ఎద్దులబండి యాక్సిడెంట్ వార్తలు
అనంతపురం జిల్లా ఉప్పొంక వద్ద ఎద్దుల బండిని బొలెరో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎద్దుల బండి యజమాని తలకు, కాళ్లకు గాయాలు కాగా.. బహిర్భూమి కోసం వెళ్తున్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
![ఎద్దుల బండిని ఢీకొట్టిన బొలెరో... మహిళకు తీవ్ర గాయాలు Bolero hits bullock cart](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8325821-430-8325821-1596775953420.jpg)
ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం, టొమాటో లోడుతో.. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి నుంచి వస్తుందని బొలెరోలో ఉన్న చెన్నప్ప అనే వ్యక్తి వివరించాడు. ప్రమాదం జరగగానే బొలెరో డ్రైవర్ నగేష్ పరారీ అయినట్లు.. తను ప్రమాదం నుంచి బయటపడినట్లు చెన్నప్ప తెలిపాడు. గాయపడిన ఇద్దర్నీ కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తలించారు. తీవ్రంగా గాయపడిన తిప్పమ్మను మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:గుంతకల్లు రైతుల కథ సుఖాంతం