అనంతపురం జిల్లా ధర్మవరం మండలం దర్శనమల వద్ద ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో 30 మంది ప్రయాణిస్తుండగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ధర్మవరం మండలం ఓబుల్ నాయనపల్లి గ్రామానికి చెందిన పలు కుటుంబాలవారు దైవ దర్శనార్థం కడప జిల్లా కొలతలకొండ అక్కమ్మ దర్శనం చేసుకొని వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బోల్తాపడ్డ బొలెరో వాహనం..పది మందికి తీవ్ర గాయాలు - undefined
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు.
బొలెరో బోల్తా- పదిమందికి తీవ్ర గాయాలు