ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయదుర్గంలో రక్తదాన శిబిరం.. విశేష స్పందన - రాయదుర్గం న్యూస్

అనంతపురం జిల్లా రాయదుర్గంలో రెడ్​ క్రాస్​ సొసైటీ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు.

blood donation camp at rayadurgam
రాయదుర్గంలో రక్తదాన శిబిరం

By

Published : Jun 13, 2021, 9:00 AM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్ పర్సన్ కాపు భారతి ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు.

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్​లో రక్తం నిల్వలు భారీగా తగ్గిపోయాయని కాపు భారతి తెలిపారు. రక్తదాన శిబిరాలకు యువత నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వందమంది యువతీ, యువకులు రక్తాన్ని దానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details