సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లా పెనుకొండలో మంత్రి శంకర్ నారాయణ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కేక్ కట్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. అందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయనకు మంచి జరగాలన్న ఆకాంక్షతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. అభివృద్ధి పనులు, ప్రజల ఆశీర్వాదాలే సీఎం జగన్ను నిండు నూరేళ్లు కాపాడతాయని మంత్రి పేర్కొన్నారు.
సీఎం పుట్టిన రోజు సందర్భంగా పెనుకొండలో రక్తదాన శిబిరం - పెనుకొండ వార్తలు
సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా అనంతపురం జిల్లా పెనుకొండలో మంత్రి శంకర్ నారాయణ రక్తదాన శిబిరం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయనకు మంచి జరగాలన్న ఆకాంక్షతో రక్తదానం చేస్తున్నామని చెప్పారు.
పెనుకొండలో రక్తదాన శిబిరం