ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొలిసారి స్వయంగా పదో తరగతి పరీక్షలు రాసిన ఆంధ విద్యార్థులు.. - ఆర్డీటీ అంధుల పాఠశాల

Blind Students : అంధ విద్యార్థులు పరీక్షలు రాయాలంటే ఇప్పటి వరకు నానా ప్రయాసలు పడేవారు. నిన్న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు మాత్రం.. సహాయకుల అవసరం లేకుండానే రాశారు. ఇంతకుముందు తాము సమాధానాలు చెప్తే సహాయంగా ఎవరో ఒకరు పరీక్షలు రాసేవారని.. ఇప్పుడు స్వయంగా తామే పరీక్షలు రాశామని అంధ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Blind Students
అంధ విద్యార్థులు

By

Published : Apr 4, 2023, 3:55 PM IST

Blind Students Write 10th Exams : అంధులు ఏ చిన్న పరీక్షలు రాయాలన్న వారికి సహాయకులు అవసరమయ్యేది. కానీ, ఇప్పుడు మాత్రం వారు ఎవరి సహాయం లేకుండానే పరీక్షలు రాశారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్​లోని అంధ విద్యార్ధులు సొంతంగా పరీక్షలు రాసేందుకు అవకాశం లభించింది. స్వయంగా వారే ల్యాప్‌టాప్‌​లో పరీక్షలు రాసిన.. ఈ సరికొత్త విధానాన్ని రాష్ట్రంలోని అనంతపురంలో అమలు చేశారు.

అంధ విద్యార్థులు పరీక్షలను సహాయకుల సాయంతో పరీక్షలు రాసేవారు. విద్యార్థులు చెప్పిన సమాధానాలను పరీక్షలలో సహాయకులు రాసేవారు. ఈ విధంగా అంధ విద్యార్థులు ఇంత వరకు పరీక్షలకు హాజరయ్యేవారు. కానీ, మొట్టమొదటి సారిగా సహాయకులు అవసరం లేకుండా సొంతంగా పరీక్షలు రాసేందుకు అంధ విద్యార్థులకు అవకాశం లభించింది. నూతనంగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలోని రాప్తాడులో ప్రవేశపెట్టారు. ఆర్డీటీ అంధుల పాఠశాలలోని ఆరుగురు విద్యార్థినులు దివ్యశ్రీ, ఎం శ్రీధాత్రి, పీ చైత్రిక, యూ నాగరత్నమ్మ, ఇ.సౌమ్య, సీ పావని.. సొంతంగా పదో తరగతి పరీక్షలు రాశారు. సోమవారం ప్రారంభమైన ఈ పదో తరగతి పరీక్షలను.. ల్యాప్‌టాప్‌​ వినియోగించి రాశారు.

ల్యాప్‌టాప్‌లో ఉన్న ప్రశ్నపత్రాన్ని హెడ్​ఫోన్​ ద్వారా విని.. సమాధానాలను ల్యాప్‌టాప్‌​లోనే టైప్​ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా ప్రశ్నలు వినిపించకపోతే.. సహాయంగా రీడర్లను సైతం ప్రభుత్వం సిద్ధం చేసింది. అంధుల కోసం ప్రత్యేకంగా ఎన్​వీడీఏ సాఫ్ట్​వేర్​ రూపొందించి, వినియోగిస్తున్నారు. కేరళకు చెందిన సాఫ్ట్​వేర్​ నిపుణుడు రామ్​ కమల్​ వీరికి సాంకేతిక సలహాలు అందిస్తున్నారు. సోమవారం తెలుగు పరీక్ష రాయగా.. ఆంగ్లం, గణితం, సాంఘికశాస్త్రం, పరిసరాల విజ్ఞాన పరీక్షలను రాయనున్నారు. పలు కారణాలతో హిందీ పరీక్షను వీరికి మినహాయించారు. ల్యాప్‌టాప్‌పై పరీక్షలు రాసేందుకు వీరు మూడు నెలలుగా సాధన చేశారు. ల్యాప్​టాప్​లో టైప్​ చేసిన సమాధానాలను.. పరీక్షలు ముగియగానే ప్రింట్​ తీసి ఓంఎంఆర్​ షీట్​కు జత చేశారు.

ఆనందం వ్యక్తం చేసిన విద్యార్థులు : తొలిసారిగా సహాయకుడి అవసరం లేకుండా పరీక్షలు రాశామని.. ఇలా రాయటం ఎంతో ఆనందంగా ఉందని అంధ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సహాయకుడి ద్వారా పరీక్ష రాస్తే మేము చెప్పిన సమాధానాలు వారు రాశారో లేదోననే అనుమానం ఉండేదని తెలిపారు. ఇప్పుడు స్వయంగా వారే పరీక్షలు రాయటం ద్వారా ఎన్ని మార్కులు వచ్చిన ఆనందమేనని అంటున్నారు. పరీక్ష రాసేందుకు సహాకరించిన ప్రతి ఒక్కరికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details