అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు అంధులను ఏకం చేసింది సాయి స్వచ్ఛంద సంస్థ. నగరానికి చెందిన సాయి కృష్ణ, లావణ్య పుట్టుకతోనే అంధులు. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఇరువురి కుటుంబాలు సాయి స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించగా... దాతల సహకారంతో వైభవంగా వివాహం చేశారు. నూతన దంపతులను జిల్లా అంధుల ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి అశీర్వదించారు.
అంధ ప్రేమికులు... అంగరంగ వైభవంగా ఒక్కటయ్యారు - ananthapuram latest news
అనంతపురంలో అంధ ప్రేమికులను పెళ్లితో ఏకం చేసింది..స్థానిక స్వచ్ఛంద సంస్థ. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నవారు పెళ్లితో ఒక్కటవుదామనుకున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేక పోవటంతో సంస్థను ఆశ్రయించగా... దాతల సహకారంతో కన్నుల పండువగా వివాహాన్ని జరిపించారు.
అంధప్రేమికులు... అంగరంగ వైభవంగా ఒక్కటయ్యారు
Last Updated : Jul 27, 2020, 7:47 PM IST