రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం రోజుకు ఒక చోట స్థల పరిశీలన చేస్తుంటే... వైకాపా నేతలు, కార్యకర్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. మెుదట హిందూపురంలో ఏర్పాటు చేస్తామన్న మెడికల్ కళశాలను.. ఎవరి ప్రయోజనాల కోసం పెనుగొండకు మార్చారని ప్రశ్నించారు. వైకాపా నేతలు, కార్యకర్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మెడికల్ కళాశాల ఏర్పాటుపై రోజుకో నిర్ణయం తీసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది తగదని హితవు పలికారు.
'మెడికల్ కళాశాల ఏర్పాటుపై కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి'
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హిందూపురంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలపై కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైకాపా నేతలు, కార్యకర్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మెడికల్ కళాశాల ఏర్పాటుపై రోజుకో నిర్ణయం తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు.
'మెడికల్ కళాశాల ఏర్పాటుపై కచ్ఛితమైన నిర్ణయం తీసుకోవాలి'
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కళాశాల ఏర్పాటుపై కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని రాష్ట్ర భాజపా తరఫున వైకాపాకి అందజేస్తామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: మద్యం తరలిస్తూ యువకులు హల్చల్.. కానిసేబుల్కు గాయాలు
TAGGED:
bjp vishnuvaran reddy news